ఆమనగల్లులో వినాయకునికి ప్రత్యేక పూజలు చేసిన గోలి శ్రీనివాస్ రెడ్డి
- తెల్కపల్లిలో ఉచిత వేరుశెనగ విత్తన పంపిణీ – పాల్గొన్న ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్ రెడ్డి - September 21, 2026
- కార్యకర్తల ఐక్యతే పార్టీకి బలం : వంశీచంద్ - September 21, 2026
- ఆమనగల్లులో వినాయకునికి ప్రత్యేక పూజలు చేసిన గోలి శ్రీనివాస్ రెడ్డి - September 21, 2026
ఆమనగల్లు, రంగారెడ్డి జిల్లా (21/09/2026):- వినాయక చవితి సందర్భంగా ఆమనగల్లు పట్టణంలో బుద్ధినాథ్ వినాయక ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుడికి తెలంగాణ ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు.నియోజకవర్గ ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థించారు. అనంతరం నిర్వాహకులు ఆయనను శాలువాతో 
సత్కరించారు.ఈ కార్యక్రమంలో BRS నాయకులు, ఉత్సవ నిర్వాహకులు సతీష్, కిరణ్, బుజ్జి తదితరులు, భక్తులు పాల్గొన్నారు.
