ఆపదలో కుటుంబాలకు ఆర్థిక భరోసా.. విద్యార్థినికి చేయూత.. బాలోత్సవానికి ప్రోత్సాహం

1001361565.jpg

కల్వకుర్తి నవంబర్ 14: తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొని ఆపదలో ఉన్న కుటుంబాలకు ఆర్థిక చేయూత అందించడంతో పాటు విద్య, బాలల అభివృద్ధికి ప్రోత్సాహం అందించారు.ఆమనగల్ పట్టణానికి చెందిన నందు అనారోగ్యంతో మృతి చెందడంతో ఆయన కుటుంబాన్ని పరామర్శించి, కల్వకుర్తి మాజీ మున్సిపల్ చైర్మన్ ఏడ్మ సత్యంతో కలిసి రూ.5 వేల ఆర్థిక సాయం అందించారు. అదేవిధంగా కల్వకుర్తి మండలం తాండ్ర గ్రామానికి చెందిన మైనార్టీ నాయకుడు ఎండీ అమీనొద్దీన్ అనారోగ్యంతో మృతి చెందగా, ఆయన కుటుంబానికి మరో రూ.5 వేల ఆర్థిక సహాయం అందించి, అండగా ఉంటామని భరోసా కల్పించారు.మరోవైపు కల్వకుర్తిలో మాజీ మున్సిపల్ చైర్మన్ ఏడ్మ సత్యంతో కలిసి బాలమిత్ర బాలోత్సవం పోస్టర్‌ను ఆవిష్కరించారు. విద్యార్థుల్లో చదువుతో పాటు సామాజిక విలువలు, విజ్ఞానం, దేశభక్తి, సంస్కారం పెంపొందించేందుకు బాలోత్సవాలు దోహదపడతాయని ఈ సందర్భంగా గోలి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు.అలాగే కల్వకుర్తి మండలం తర్నికల్ గ్రామానికి చెందిన వాటం శ్రీశైలం కుమార్తె సౌమ్య ఎంబీబీఎస్ సీటు సాధించడంతో వైద్య విద్య ఖర్చుల నిమిత్తం రూ.25 వేల ఆర్థిక సహాయం అందించారు.ఈ కార్యక్రమాల్లో సుభాష్, సతీష్, శివ, లండం శివ, మాజీ ఉపసర్పంచ్ మైబు యాదవ్, బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు మల్లయ్య, రమేష్, అనిల్, జంగయ్య, శ్రీశైలం యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

You may also like...