వెల్దండ గర్వకారణం వివేక్ – భవిష్యత్తులో మంచి వైద్యుడిగా ఎదగాలి: సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్

వెల్దండ :వెల్దండ మండలానికి చెందిన విద్యార్థి మానెమోని వివేక్ ఎంబీబీఎస్ లో సీటు సాధించడం మండలానికే గర్వకారణమని గ్రామ సర్పంచ్ ముట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్ అన్నారు.సోమవారం గ్రామంలో ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో వివేక్ ను శాలువాతో సన్మానించి అభినందించారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, రామకృష్ణ కుమారుడైన వివేక్ చిన్నప్పటి నుండి చదువులో చురుగ్గా ఉంటూ నీట్ -2026 లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ఎంబీబీఎస్ సీటు సాధించాడని, నిరుపేద కుటుంబం నుండి వచ్చి తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తించి కష్టపడిన ఫలితమే ఈ విజయమని కొనియాడారు. భవిష్యత్తులో మంచి వైద్యుడిగా ఎదిగి పేద ప్రజలకు సేవ చేయాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య మహాసభ జిల్లా మాజీ ఉపాధ్యక్షులు బచ్చు రామకృష్ణ, అంజన్ రెడ్డి, హరికాంత్ రెడ్డి, వార్డు సభ్యులు పురుషోత్తం చారి, కిష్టాల్, ఎండి రషీద్, కొయ్యల పుల్లయ్య, సాయి రెడ్డి,గ్రామ పెద్దలు, యువకులు, వివేక్ తండ్రి రామకృష్ణ తదితరులు పాల్గొని వివేక్ ను అభినందించారు.1012699448.jpg

You may also like...