కంటోన్ పల్లి లో చేయూత పింఛన్ల ఆకస్మిక తనిఖీలు – రాష్ట్ర బృందం పరిశీలన
- మానవత్వం చాటుకున్న సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్ - September 16, 2026
- కంటోన్ పల్లి లో చేయూత పింఛన్ల ఆకస్మిక తనిఖీలు – రాష్ట్ర బృందం పరిశీలన - September 15, 2026
- శ్రీరాములు కుటుంబానికి ఉప్పల ట్రస్ట్ అధినేత ఆర్థిక సహాయం - September 15, 2026

వెల్దండ: చేయూత పెన్షన్ల పరిశీలనలో భాగంగా రాష్ట్ర బృందం కంటోనిపల్లి గ్రామపంచాయతీని ఆకస్మికంగా తనిఖీ చేసింది. క్షేత్ర స్థాయిలో పరిశీలన ఎలా జరుగుతుందో చూసింది.రాష్ట్ర బృందం సంచాలకులు కృష్ణమూర్తి ఆధ్వర్యంలో ఈ తనిఖీ జరిగింది.ఈ కార్యక్రమంలో సర్పంచ్ మమత లక్ష్మణస్వామి,తనిఖీ అధికారి మోహన్ లాల్ సహాయ కార్యక్రమ నిర్వాహకురాలు జయమాలిని,పంచాయతీ కార్యదర్శి ఫయాజ్, జిల్లా కార్యక్రమ నిర్వాహకులు శ్రీనివాస్,ఉప సర్పంచ్ శివప్రసాద్ పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు.పరిశీలన పారదర్శకంగా జరగాలని, అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం జరగాలని సంచాలకులు సూచించారు.
