స్కూల్ ప్రీమియర్ లీగ్‌కు ఘన ప్రారంభం..! క్రీడాకారుల్లో జోష్ నింపిన గోలి శ్రీనివాస్ రెడ్డి..!

1001351678.jpg

కల్వకుర్తి,నవంబర్11 :కల్వకుర్తి పట్టణం మొత్తం క్రికెట్ జోష్‌తో ఊగిపోయింది. విద్యార్థుల్లో దాగిన ప్రతిభను బయటకు తీసి,క్రీడాస్ఫూర్తిని పెంపొందించే లక్ష్యంతో నిర్వహిస్తున్న కల్వకుర్తి స్కూల్ ప్రీమియర్ లీగ్టోర్నమెంట్‌కు అట్టహాసంగా శ్రీకారం చుట్టారు.ఈ టోర్నమెంట్‌ను తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి ఘనంగా ప్రారంభించారు. క్రీడాకారులను స్వయంగా పరిచయం చేసుకొని, టాస్ వేసి మ్యాచ్‌కు శ్రీకారం చుట్టారు. ఆ క్షణం మైదానమంతా చప్పట్లతో మారుమోగిపోయింది.ఈ సందర్భంగా గోలి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. క్రీడలు కేవలం ఆట కాదు, జీవిత పాఠం. క్రమశిక్షణ, ఐకమత్యం, నాయకత్వ లక్షణాలు క్రీడల వల్లే వస్తాయి. చదువుతో పాటు ఆట కూడా ఉంటేనే విద్యార్థి పరిపూర్ణంగా ఎదుగుతాడు అని అన్నారు.ఈ కార్యక్రమంలో కల్వకుర్తి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సింగం విజయ్ గౌడ్, వెల్దండ మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పుట్ట రామ్ రెడ్డి,మాజీ ఎంపీటీసీలు నాగులు నాయక్,లింగం, సర్పంచ్ కృష్ణ,వార్డు సభ్యులు *సునీత, ఆనంద్, ప్రవీణ్, తరుణ్,టోర్నమెంట్ నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.

You may also like...