దొంగతనాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- మోదీతో సీడబ్ల్యూజీ విజేతల భేటీ - August 9, 2026
- విద్యార్థులపై దాడిపై అమిత్ షా మౌనం ఎందుకు? - August 9, 2026
- భాగ్యలక్ష్మి ఆలయాన్ని గోల్డెన్ టెంపుల్‌గా మారుస్తాం - August 9, 2026

జ్ఞాన తెలంగాణ కల్వకుర్తి నియోజకవర్గ ప్రతినిధి ఆగస్టు 09:వెల్దండ మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వెల్దండ పోలీసులు ఆదివారం హెచ్చరిక జారీ చేశారు. శనివారం రాత్రి పలుగు తాండ గ్రామంలో బాల్య అనే రైతు యొక్క 13 మేకలను గుర్తు తెలియని వ్యక్తులు దొంగలించడం జరిగింది. ఇట్టి దొంగతనంలో పోలీసు వారు అనుమానిస్తున్నదేమనగా కర్ణాటక రిజిస్ట్రేషన్ నంబరు తో ఉన్న ఒక బ్లూ కలర్ కారు లొ వచ్చి మేకలను దొంగలించినట్టు అనుమానిస్తున్నారు. ఇదే కారు లో గత మూడు రోజుల క్రితం చారకొండ మండలంలో ఇదేవిధంగా మేకలను దొంగ తనం చేయడం జరిగింది.కాబట్టి మేకలు,పొట్టేలు ఉన్న రైతులు జాగ్రత్తగా గమనిస్తూ రాత్రి సమయంలో తప్పనిసరిగా తమ యొక్క గొర్రెల,పొట్టేళ్ల దగ్గర కాపలాగా ఉండవలని పోలీసులు హెచ్చరించారు.అంతేకాక ఏదైనా అనుమానించే విధంగా ఏదైనా వాహనాలు కారు లేదా బొలెరో వంటి వాహనాలు అనుమానం గా కనిపించిన యెడల తక్షణమే100 కు డయల్ చేసి సమాచారం ఇవ్వాలని ఎస్సై యుగంధర్ రెడ్డి తెలిపారు.
