ప్రతి తండాకు స్వచ్ఛమైన త్రాగునీరు అందించడమే లక్ష్యంటాస్క్ సీఓఓసుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి
- మోదీతో సీడబ్ల్యూజీ విజేతల భేటీ - August 9, 2026
- విద్యార్థులపై దాడిపై అమిత్ షా మౌనం ఎందుకు? - August 9, 2026
- భాగ్యలక్ష్మి ఆలయాన్ని గోల్డెన్ టెంపుల్‌గా మారుస్తాం - August 9, 2026

మాడ్గుల మండలం పకీర తండాలో ఐక్యత ఫౌండేషన్ సహకారంతో రూ. 1,50,000/ రూపాయలతో ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ ప్లాంటును ఐక్యత ఫౌండేషన్ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు టాస్క్ సిఓఓ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది.అనంతరం తండాలో ఘనంగా నిర్వహించిన సీత్ల భవానీ పండుగ వేడుకల్లో ప్రజలతో కలిసి పాల్గొన్నారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ..స్వచ్ఛమైన త్రాగునీరు అనేది సౌకర్యం మాత్రమే కాకుండా,ప్రతి మనిషి ఆరోగ్యవంతమైన జీవితానికి ప్రాథమిక అవసరం,మారుమూల ప్రాంతాల్లోని ప్రజలు త్రాగునీటి కోసం ఇబ్బందులు పడటం బాధాకరం, అందుకే ప్రతి తండా..ప్రతి గ్రామానికి స్వచ్ఛమైన, రక్షిత త్రాగునీరు అందించాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నాం అని తెలిపారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ శారద శ్రీను, ఉప రాజేందర్ నాయక్, మాజీ సర్పంచ్ పద్మ జగదీష్, వార్డు సభ్యులు బుజ్జి, రవి, లచ్చి,మాజీ వార్డు సభ్యులు భీక్య,రాజు, బీక్కి లతో పాటు మాడుగుల ఐక్యత ఫౌండేషన్ ఇంచార్జి సూదిని జైపాల్ రెడ్డి మరియు తండా ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

