విద్యుత్ షాక్‌తో యువకుడి మృతి
- మరికొద్ది క్షణాల్లో టంగుటూరుకు మందకృష్ణ మాదిగ - October 15, 2026
- దేవుల నాయక్కు బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడి జన్మదిన శుభాకాంక్షలు - October 12, 2026
- పెళ్లి హామీతో లైంగిక వేధింపుల ఆరోపణ.. డీఐ బాలస్వామి అరెస్ట్! - October 11, 2026

షాద్‌నగర్ నెహ్రూ కాలనీకి చెందిన జమాల్పూర్ నవీన్ (24) బుధవారం ఉదయం విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందాడు.చట్టాన్‌పల్లి రైల్వే గేట్ సమీపంలోని మటన్ షాపులో విద్యుత్ వైరు మరమ్మతు చేస్తుండగా ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ తగిలి నవీన్ కిందపడిపోయాడు. వెంటనే స్థానికులు అతడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.నవీన్ మృతితో అతని కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. బంధువులు, స్నేహితులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
