అస్వస్థతతో ఆసుపత్రిలో చేరిన ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే

మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే అస్వస్థతకు గురయ్యారు. గత రెండు రోజులుగా స్వల్ప జ్వరం, తీవ్ర నీరసం, ఒళ్లునొప్పులతో బాధపడుతున్న ఆయనను కుటుంబ సభ్యులు వైద్యుల సూచన మేరకు థానేలోని జూపిటర్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు పలు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.

షిండే ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని, వైద్యుల ప్రత్యేక బృందం నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు సమాచారం. కొన్ని రోజులుగా వరుస రాజకీయ కార్యక్రమాలు, ఎన్నికల సన్నాహాలు, ప్రభుత్వ పరిపాలనా బాధ్యతలు, అధిక పనిభారం కారణంగానే ఆయన ఆరోగ్యం దెబ్బతిన్నట్లు తెలుస్తోంది.

షిండే త్వరగా కోలుకోవాలని పలువురు రాజకీయ నాయకులు, పార్టీ శ్రేణులు, అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. వైద్యుల సూచన మేరకు ఆయన కొద్ది రోజుల పాటు విశ్రాంతి తీసుకునే అవకాశం ఉందని సమాచారం. ప్రస్తుతం ఆయన ఆరోగ్యంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆసుపత్రి వర్గాలు స్పష్టం చేశాయి.

You may also like...