ధర్మసమాజ్ పార్టీ అభ్యర్థిని గెలిపించుకుందాండి.ఎస్.పి మండల నాయకులు అశోక్.

ధర్మసమాజ్ పార్టీ అభ్యర్థిని గెలిపించుకుందాం
డి.ఎస్.పి మండల నాయకులు అశోక్.
జ్ఞానతెలంగాణ చిట్యాల ఏప్రిల్ 30:
బీసీ ఎస్సీ ఎస్టీలైన సబ్బండ కులాల తరఫున ఉన్న ఏకైక పార్టీ ధర్మసమాజ్ పార్టీ వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి మేకల సుమన్ ను గెలిపించుకుందామని ఆ పార్టీ మండల నాయకులు పుల్ల అశోక్ బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలను కోరారు. మంగళవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలో విలేకరులతో మాట్లాడుతూ ధర్మసమాజ్ పార్టీకి చెప్పుల గుర్తు ఎన్నికల కమిషన్ కేటాయించిందని ఆ గుర్తుకు ఓటు వేసి వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిని గెలిపించాలని ఓటరు మహాశయులను విజ్ఞప్తి చేశారు. బిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్ పార్టీలన్నీ బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలకు వ్యతిరేకమని భారత రాజ్యాంగాన్ని నిర్మూలించడానికి అవి కుట్ర పన్నుతున్నాయని ఆరోపించారు. భారత రాజ్యాంగ రక్షణ పార్టీగా ధర్మసమాజ్ పార్టీ అనేక పోరాటాలు చేస్తుందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం బలిపీఠం ఎక్కింది బీసీ ఎస్సీ ఎస్టీలైతే లబ్ధి పొదింది కేవలం రెడ్డి, వెలుమలని ఆరోపించారు. రెడ్డి వెలుమలకు రాజకీయ చరమగీతం పాడి, అణగారిన వర్గాలకు అధికారాన్ని కట్టబెట్టేందుకు ధర్మ సమాజ్ పార్టీ పనిచేస్తుందన్నారు. చెప్పుల గుర్తుకు ఓటు వేసి ధర్మసమాజ్ పార్టీ అభ్యర్థి మేకల సుమన్ ని గెలిపించాలని మరోసారి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు నెరేళ్ల రమేష్, మట్టేవాడ కుమార్, నద్దునూరి రాజకుమార్, పర్లపల్లి కుమార్ తదితరులు పాల్గొన్నారు.*