నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. కల్వకుర్తి ఐటీఐలో మూడు ఉద్యోగాలు.. ఐదు రోజులే గడువు!
- వెల్దండ సర్పంచుకు సీఐ నర్సింహులు ఆత్మీయ సత్కారం.! - November 15, 2026
- కల్వకుర్తిలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంపై ప్రతిపక్ష సర్పంచ్ల అభ్యంతరం.! - November 15, 2026
- అక్షరాల రూపంలో జీవిత ఆటుపోట్లు.. ‘ఆటుపోట్లు’ పుస్తకాన్ని ఆవిష్కరించిన సుంకిరెడ్డి! - November 15, 2026
కల్వకుర్తి నవంబర్ 15: నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థ (ఐటీఐ) / అడ్వాన్స్‌డ్ ట్రైనింగ్ సెంటర్ (ఏటీసీ) కళాశాలలో ఖాళీగా ఉన్న మూడు అవుట్‌సోర్సింగ్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ కె. జయమ్మ ఒక ప్రకటనలో తెలిపారు.
ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలు:అటెండర్ – 01,స్వీపర్ – 01,వాచ్‌మెన్ (సెక్యూరిటీ గార్డు)- 01- ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు ఈ నెల 16వ తేదీ నుంచి 20వ తేదీ వరకు తమ దరఖాస్తులను అవసరమైన వివరాలు, ధ్రువపత్రాలతో కల్వకుర్తి ప్రభుత్వ ఐటీఐ / ఏటీసీ కళాశాల కార్యాలయంలో నేరుగా సమర్పించాలని సూచించారు.నిర్దేశిత గడువులోగా దరఖాస్తులు అందజేయాలని, ఉద్యోగాలకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం కళాశాల కార్యాలయాన్ని సంప్రదించాలని ప్రిన్సిపాల్ కె. జయమ్మ తెలిపారు.
