ఆపదలో ఉన్న కుటుంబానికి ఉప్పల వెంకటేష్ ఆర్థిక చేయూత.!
- వెల్దండ సర్పంచుకు సీఐ నర్సింహులు ఆత్మీయ సత్కారం.! - November 15, 2026
- కల్వకుర్తిలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంపై ప్రతిపక్ష సర్పంచ్ల అభ్యంతరం.! - November 15, 2026
- అక్షరాల రూపంలో జీవిత ఆటుపోట్లు.. ‘ఆటుపోట్లు’ పుస్తకాన్ని ఆవిష్కరించిన సుంకిరెడ్డి! - November 15, 2026

కల్వకుర్తి ప్రతినిధి నవంబర్ 15: చెదురుపల్లి గ్రామానికి చెందిన కొమ్ము చిన్న అంజయ్య నాలుగు రోజుల క్రితం మృతి చెందడంతో, విషయం తెలుసుకున్న ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, తలకొండపల్లి జెడ్పీటీసీ, మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ బాధిత కుటుంబానికి అండగా నిలిచారు. తన వంతు సహాయంగా రూ.3,000 ఆర్థిక సాయాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు.స్థానిక బీఆర్ఎస్ నాయకుల ద్వారా విషయం తెలుసుకున్న ఆయన కుటుంబానికి ఆర్థిక సాయం అందించడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ దన్ సింగ్ నాయక్, ఉపసర్పంచ్ సహదేవ్, వార్డు సభ్యుడు శివ యాదవ్, గ్రామ పెద్దలు, బీఆర్ఎస్ యువ నాయకులు పోలే అశోక్, కొమ్ము అంజయ్య, బింగి నారయ్య, పెద్ద అంజయ్య, పోలే బండి సాయిలు, కొమ్ము శివయ్య, మహేష్, రాజు, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
