చేయూత పెన్షన్ల మంజూరు పత్రాల పంపిణీ..సర్పంచ్ మొక్తాల రమేష్.!
- వెల్దండ సర్పంచుకు సీఐ నర్సింహులు ఆత్మీయ సత్కారం.! - November 15, 2026
- కల్వకుర్తిలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంపై ప్రతిపక్ష సర్పంచ్ల అభ్యంతరం.! - November 15, 2026
- అక్షరాల రూపంలో జీవిత ఆటుపోట్లు.. ‘ఆటుపోట్లు’ పుస్తకాన్ని ఆవిష్కరించిన సుంకిరెడ్డి! - November 15, 2026

వెల్దండ నవంబర్ 15: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న చేయూత పింఛన్ల పథకం కింద కుప్పగండ్ల గ్రామానికి కొత్తగా 36 పింఛన్లు మంజూరయ్యాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో,కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి సహకారంతో పింఛన్లు మంజూరైనట్లు గ్రామ సర్పంచ్ మొక్తాల రమేష్ తెలిపారు.ఈ సందర్భంగా సర్పంచ్ మొక్తాల రమేష్ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం నూతనంగా పింఛన్లు మంజూరైన లబ్ధిదారులకు ప్రొసీడింగ్ పత్రాలను అందజేశారు.కొత్తగా పింఛన్లు మంజూరైన వితంతు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, గీత కార్మికులు ఆనందం వ్యక్తం చేశారు. ఎన్నో ఏళ్ల తర్వాత తమకు పింఛన్లు మంజూరు కావడంతో ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, కాంగ్రెస్ గ్రామ అధ్యక్షుడు, సింగిల్ విండో డైరెక్టర్, బీఎంసీయూ చైర్మన్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, యువ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
