శుభకార్యాలు, ప్రజా కార్యక్రమాల్లో ఉప్పల వెంకటేష్ సందడి – బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం.!

1001364895.jpg

జ్ఞాన తెలంగాణ,కల్వకుర్తి నియోజకవర్గ ప్రతినిధి నవంబర్ 15 : రాష్ట్ర మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్, ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, బీఆర్ఎస్ నాయకులు ఉప్పల వెంకటేష్ కల్వకుర్తి నియోజకవర్గంలో ఆదివారం పలు శుభకార్యాలు, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు.కల్వకుర్తి పట్టణంలోని రాయల్ ప్యాలెస్ ఫంక్షన్ హాల్‌లో జీడిపల్లి మాజీ ఉపసర్పంచ్ మహమ్మద్ ఖాజా కుమార్తె సారీ ఫంక్షన్‌కు, పార్థసారథి ఫంక్షన్ హాల్ సమీపంలోని కల్వకుర్తి డైరీస్ కార్యాలయానికి వెళ్లి కార్తీక్‌ను కలిశారు. అనంతరం కళ్యాణ్ నగర్‌లో మాజీ వార్డు సభ్యురాలు మల్లీశ్వరి సోదరుడి వివాహ విందుకు హాజరయ్యారు.కల్వకుర్తి మండలం తర్నికల్ తండాలో బీఆర్ఎస్ గ్రామ కమిటీ అధ్యక్షుడు గుండియా నాయక్ కుమారుడి వివాహ విందులో పాల్గొన్నారు. అక్కడి హనుమాన్ దేవాలయాన్ని సందర్శించి, ఆలయంలో బెడ్ నిర్మాణానికి సహకరిస్తానని హామీ ఇచ్చారు. ఇటీవల గుండెపోటుతో మృతి చెందిన వ్యక్తి కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సాయం అందజేశారు.అనంతరం కల్వకుర్తి క్రికెట్ స్టేడియంలో నిర్వహిస్తున్న కేపీఎల్ జూనియర్స్ క్రికెట్ ప్రీమియర్ లీగ్‌కు హాజరయ్యారు. పట్టణంలోని హనుమాన్ నగర్‌కు చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు భీమయ్య కుమార్తె సారీ ఫంక్షన్‌లోనూ పాల్గొని కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమాల్లో పలు గ్రామాల సర్పంచులు, మాజీ ప్రజాప్రతినిధులు, మాజీ కౌన్సిలర్లు, బీఆర్ఎస్ నాయకులు, ఉప్పల వెంకటేష్ అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

You may also like...