ఆపన్నులకు అండగా ఏల సుందర్.. ఇద్దరు దివ్యాంగులకు వీల్‌చైర్లు పంపణి
- ఆపన్నులకు అండగా ఏల సుందర్.. ఇద్దరు దివ్యాంగులకు వీల్‌చైర్లు పంపణి - November 15, 2026
- నీళ్ల పేరుతో రాజకీయాలు చేస్తే ఊరుకునేది లేదు: అనిల్ కుమార్ - October 26, 2026
- దసరా శుభాకాంక్షలు తెలిపిన సీఐ భరత్ సుమన్ - October 19, 2026

దేవరుప్పుల: ఆపదలో ఉన్నవారికి అండగా నిలవడమే లక్ష్యంగా సుందర్ చారిటబుల్ ట్రస్ట్ సేవా కార్యక్రమాలు కొనసాగిస్తోంది. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదేశాల మేరకు దేవరుప్పుల మండల కేంద్రంలోని కొత్తవాడకు చెందిన తొలుపునూరి యాకయ్య కుమారుడు సిద్దుతో పాటు జోగు మైసయ్యకు ట్రస్ట్ చైర్మన్ ఏల సుందర్ వీల్‌చైర్లు అందజేశారు. చిన్నతనం నుంచి నడవలేని స్థితిలో ఉన్న వారికి ఈ సహాయం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని గ్రామస్తులు పేర్కొన్నారు. బాధిత కుటుంబాలు ఏల సుందర్‌కు, ట్రస్ట్‌కు కృతజ్ఞతలు తెలిపాయి. దివ్యాంగులకు అండగా నిలుస్తూ మానవత్వాన్ని చాటుతున్న సుందర్ సేవలను పలువురు అభినందించారు. ఈ కార్యక్రమంలో తోటకూరి కిష్టయ్య, రామచంద్రు, ఆలకుంట్ల వెంకన్న, నీలారపు పెద్ద వెంకన్న, పలుసం నరసింహులు, మహేష్, దూలం నరేష్, దుంపల సంపత్, ఓర్సు ఐలయ్య, కారుపోతుల వెంకన్న, రాసాల చరణ్ సాయి, తదితరులు పాల్గొన్నారు.
