రిపోర్టర్, సంగారెడ్డి | 9000600737
Latest posts by MOHAMMAD MOHAMMAD
(see all) జహీరాబాద్: కొత్తపూర్-బి గ్రామంలోని ఒంకార్ షుగర్ ఫ్యాక్టరీని వెంటనే ప్రారంభించాలని జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్ రావు డిమాండ్ చేశారు. శనివారం ఆయన ఫ్యాక్టరీని సందర్శించి పనుల పురోగతిని పరిశీలించారు.
ఫ్యాక్టరీ ప్రారంభంలో జాప్యం జరిగితే చెరకు రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. మిగిలిన పనులను త్వరితగతిన పూర్తి చేసి చెరకు క్రషింగ్ ప్రక్రియను ప్రారంభించాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, చెరకు రైతులు పాల్గొన్నారు.