భారత్ సమ్మిట్‌కు రాహుల్ గాంధీ రాకను వ్యతిరేకిస్తూ బీజేపీ నిరసన

WhatsApp Image 2026-11-14 at 20.00.16.jpeg

హైదరాబాద్‌లో జరుగుతున్న భారత్ సమ్మిట్ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హాజరుకావడాన్ని వ్యతిరేకిస్తూ జనగామలో బీజేపీ నాయకులు నిరసన చేపట్టారు. జిల్లా అధ్యక్షుడు సౌడ రమేష్ ఆధ్వర్యంలో ఆర్టీసీ చౌరస్తాలో నల్ల బ్యాడ్జీలు ధరించి, నల్ల జెండాలతో ఆందోళన నిర్వహించారు.ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ.. 70 దేశాల నుంచి వెయ్యి మందికి పైగా ప్రతినిధులు పాల్గొంటున్న భారత్ సమ్మిట్‌ను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవడాన్ని వ్యతిరేకిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని రాహుల్ గాంధీ తన స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని ఆరోపించారు.ఈ నిరసనలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆరుట్ల దశమంత రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు విద్యాసాగర్ రెడ్డి, రాష్ట్ర నాయకులు ఉడుగుల రమేష్, శివరాజ్ యాదవ్, జిల్లా ప్రధాన కార్యదర్శులు తోకల ఉమారాణి, ఐలోని అంజిరెడ్డి, భాగాల నవీన్ రెడ్డి, అంకుగారి శశిధర్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు, బీజేవైఎం నాయకులు, మహిళా మోర్చా నాయకులు, వివిధ మండలాల అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

You may also like...