ఘనంగా నెహ్రూ 137వ జయంతి వేడుకలు
- ఐక్యంగా ఉద్యమించాలి: జిల్లా సంయుక్త కార్యదర్శిగా యామంకి విజయ్ నియామకం - November 14, 2026
- బాలల హక్కులు, విధులు, బాధ్యతలపై అవగాహన - November 14, 2026
- ఘనంగా రాష్ట్రస్థాయి సెపక్ తక్రా టోర్నమెంట్ ముగింపు వేడుకలు - November 14, 2026

డీసీసీ అధ్యక్షురాలు ధన్వంతి లక్ష్మీనారాయణ ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ 137వ జయంతి వేడుకలను జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డీసీసీ అధ్యక్షురాలు లకావత్ ధన్వంతి లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.అనంతరం నాయకులు మాట్లాడుతూ స్వాతంత్ర్య పోరాటంలో నెహ్రూ చేసిన సేవలు, దేశ అభివృద్ధికి ఆయన వేసిన పునాదులు చిరస్మరణీయమని పేర్కొన్నారు. విద్యా, పారిశ్రామిక, శాస్త్ర సాంకేతిక రంగాల అభివృద్ధికి ఆయన చేసిన కృషిని కొనియాడారు. నెహ్రూ ఆశయాలు, ఆదర్శాలను ప్రతి ఒక్కరూ అనుసరించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్పర్సన్ వేమళ్ల సత్యనారాయణ రెడ్డి, ఎర్రమల్ల సుధాకర్, వంగల కళ్యాణి మల్లారెడ్డి, లింగాల జగదీష్ చందర్, వేముల మల్లేష్, జయ మల్లేష్, మాజిద్ అఫ్సర్ తదితర కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
