డ్రగ్స్‌ రహిత సమాజ నిర్మాణంలో యువత కీలక పాత్ర పోషించాలి

 చింతల్‌లోని భాగ్యరధి డిగ్రీ కళాశాలలో కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ‘నషా ముక్త యువ – నషా ముక్త్ భారత్ అభియాన్’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జీడిమెట్ల ఎస్‌ఐ గంగాధర్ మాట్లాడుతూ యువత గంజాయి, డ్రగ్స్‌ వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. డ్రగ్స్‌ విక్రయాలు, వినియోగంపై పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. ప్రిన్సిపాల్ నవీన్ రాజ్ విద్యార్థులు చెడు వ్యసనాలకు బానిసై భవిష్యత్తును నాశనం చేసుకోవద్దన్నారు. సామాజిక కార్యకర్త కుమార్ యాదవ్ మాట్లాడుతూ ఆరోగ్యవంతమైన, క్రమశిక్షణ కలిగిన యువతతోనే దేశాభివృద్ధి సాధ్యమన్నారు. కార్యక్రమంలో బీజేవైఎం నాయకుడు మణి, వాలంటీర్ రేవంత్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

You may also like...