మతాలు వేరైనా మానవత్వం ఒక్కటే.. క్రైస్తవ ధరూర్ జాతర వెళ్తున్న భక్తులకు సేవలందించిన

మతాలు వేరైనా మనసులు మంచివైనప్పుడే సమాజంలో ఐక్యత, సోదరభావం వెల్లివిరుస్తాయని సంగారెడ్డి జిల్లా డీసీసీ ఉపాధ్యక్షులు మొహమ్మద్ ముల్తాని అన్నారు. ప్రజలు భక్తి మార్గంలో నడుస్తూ దైవాన్ని ఆరాధించినప్పుడే మనశ్శాంతి లభిస్తుందని పేర్కొన్నారు.శుక్రవారం జహీరాబాద్ నియోజకవర్గ పరిధిలోని మనియార్‌పల్లి గ్రామం మీదుగా క్రైస్తవులు అత్యంత పవిత్రంగా భావించే ధరూర్ 104వ జాతరను పురస్కరించుకొని పాదయాత్రగా బయలుదేరిన క్రైస్తవ సోదర సోదరీమణులకు మొహమ్మద్ ముల్తాని సేవలందించారు. ఈ సందర్భంగా పాదయాత్రికులకు చల్లటి పానీయాలు, అన్నం పొట్లాలను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో జ్యోతి నర్సింలు, ఎరుపుల నగేష్, ఎర్ర అశోక్, నుల్క ప్రశాంత్, గడ్డమిది అంజన్న, గణపురం రాజు, గడ్డం సూదాం తదితరులు పాల్గొన్నారు

You may also like...