రైతుల అభివృద్ధికి ఎఫ్ పీఓలు కీలకం : నాబార్డు డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ రాకేష్ కశ్యప్
- రైతుల అభివృద్ధికి ఎఫ్ పీఓలు కీలకం : నాబార్డు డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ రాకేష్ కశ్యప్ - November 13, 2026
- నీటి సంరక్షణ, ఆరుతడి పంటల సాగుపై అవగాహన కల్పించాలి. నకిరేకల్ ఏఎంసీ చైర్మన్ గుత్తా మంజుల మాధవరెడ్డి - November 12, 2026
- రాష్ట్ర స్థాయి వాలీబాల్ జట్టుకు దుగినవెల్లి విద్యార్థి ఎంపిక - November 11, 2026
జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, నవంబర్ 13 : రైతుల అభ్యున్నతి, వ్యవసాయ రంగ అభివృద్ధిలో రైతు ఉత్పత్తిదారుల సంస్ధలు కీలక పాత్ర పోషిస్తున్నాయని నాబార్డు డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ రాకేష్ కశ్యప్ అన్నారు. శుక్రవారం మండలంలోని అయిటిపాముల జీపీ పరిధిలోని గంగదేవిగూడెంలో ఉన్న కట్టంగూర్ రైతు ఉత్పత్తిదారుల కంపెనీని సందర్శించి రైతుల సంక్షేమ కోసం చేపడుతున్న కార్యక్రమాలు, సదుపాయాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 204 7నాటికి స్వాతంత్ర్యం వచ్చి వందేళ్లు పూర్తయ్యే సమయానికి వ్యవసాయ రంగంలో భారత యూరఫ్ వంటి అభివృద్ధి చెందిన దేశాలతో పోటీపడే స్థాయికి చేరుకుంటుందన్నారు. కట్టంగూర్ రైతు ఉత్పత్తిదారుల కంపెనీ సన్న, చిన్నకారు రైతలకు ప్రత్యేక్షంగా, పరోక్షంగా ప్రయోజనం చేకూర్చే కార్యక్రమాలు నిర్వకహించడం అభినందనీయమన్నారు. కార్బన్ క్రెడిట్ బయోచార్ వంటి వినూత్న కార్యక్రమాలను ఎఫ్ పీఓ భాగస్వామ్యంతో చేపట్టడం రైతులకు మేలు చేస్తుందని తెలిపారు. వ్యవసాయ రంగం భవిష్యత్లో మరింత అభివృద్ధి చెందాలంటే యువత ఆధునిక రంగంలోకి రావాలని సూచించారు. కార్యక్రమంలో నాబార్డు చీఫ్ జనరల్ మేనేజర్ ఉదయభాస్కర్, జనరల్ మేనేజర్ రాజ్యలక్ష్మి, యాదాద్రి భువనగిరి నాబార్డు అధికారి ఝూన్సీ, ఎఫ్ పీఓ చైర్మన్ సైదమ్మ, ఐఆర్డీఎస్ అధ్యక్షులు రమేష్, సీఈఓ జక్కల రమేష్, మునుగోడు ఉద్యానవన అధికారి విద్యాసాగర్, స్వచ్ఛశక్తి సీఈఓ సుధాకర్ బాబు తదితరులు పాల్గొన్నారు.
