ఖైత‌లాపూర్ చెరువును కాపాడిన హైడ్రా


 మేడ్చ‌ల్ – మ‌ల్కాజిగిరి జిల్లా కూక‌ట్‌ప‌ల్లి మండ‌లం ఖైత‌లాపూర్ గ్రామంలోని ఖైత‌లాపూర్ చెరువును హైడ్రా అధికారులు. చెరువు ఎఫ్‌టీఎల్ ప‌రిధిలోని 9.06 ఎక‌రాల భూమి క‌బ్జాల‌కు గురి కాకుండా చెరువు చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. ఫెన్సింగ్ వేయ‌డంలో భాగంగా.. పొద‌లలో క‌నిపించ కుండా ఉన్న స‌మాధి రాయి జేసీబీకి త‌గిలి తొల‌గ‌డంతో స్వ‌ల్ప ఉద్రిక్త‌త ఏర్ప‌డింది. ముళ్ల పొద‌ల‌ను జేసీబీతో తొల‌గించే క్ర‌మంలో స‌మాధిగా గుర్తించేందుకు ఉద్దేశించి పాతిన రాయి తొల‌గ‌డంతో ఈ ఇబ్బంది ఏర్ప‌డింది. ఆ రాయి ఉన్న శ్మ‌శాన స్థ‌లాన్ని మిన‌హాయించి ఎఫ్‌టీఎల్ ప‌రిధిని కాపాడుతూఫెన్సింగ్ వేసిన‌ట్టు అక్క‌డ ప‌నుల‌ను ప‌ర్య‌వేక్షించిన హైడ్రా అధికారి వెల్ల‌డించారు. ఇదే స‌మ‌యంలో పోలీసులు కూడా వ‌చ్చి అక్క‌డ ఎలాంటి ఇబ్బంది లేకుండా బందోబ‌స్తు ఏర్పాటు చేశారు. చెరువు ఎఫ్‌టీఎల్‌కు చెందిన భూమిగా పేర్కొంటూ ఫెన్సింగ్ వేయ‌డంతో పాటు.. హైడ్రా బోర్డులు ఏర్పాటు చేశారు.

You may also like...