అక్రమ బోర్లు రహదారుల కబ్జాపై హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదుల వెల్లువ
చెరువుల చెంత అక్రమ బోర్లు.. రహదారుల ఆక్రమణలు హైడ్రా ప్రజావాణికి 36 ఫిర్యాదులు హైదరాబాద్: నగర పరిధిలో చెరువుల ఆక్రమణలు, అక్రమ బోర్లు, రహదారుల కబ్జాలపై ప్రజల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. సోమవారం నిర్వహించిన హైడ్రా ప్రజావాణికి మొత్తం 36 ఫిర్యాదులు అందాయి. వీటిలో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల ఆక్రమణలు, రహదారుల కబ్జాలు ప్రధానంగా ఉన్నాయి. చెరువుల సమీపంలో అక్రమంగా బోర్లు ఏర్పాటు చేసి, రాత్రి వేళల్లో ట్యాంకర్ల ద్వారా నీటిని తరలించి విక్రయిస్తున్నారని స్థానికులు…
