హల్దీ వేడుకలో వధువుకు పట్టువస్త్రాలు అందజేసిన ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి దంపతులు
- మొయినాబాద్ సదర్ సమ్మేళనానికి ముఖ్యఅతిథిగా హాజరైన మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ - November 12, 2026
- హల్దీ వేడుకలో వధువుకు పట్టువస్త్రాలు అందజేసిన ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి దంపతులు - November 12, 2026
- నీటిపారుదల డీఈఈ ఇంట్లో ఏసీబీ సోదాలు – రూ.100 కోట్ల అక్రమాస్తులు.! - November 12, 2026

కల్వకుర్తి, నవంబర్ 12: ఈ నెల 15వ తేదీన కల్వకుర్తి మాజీ వైస్ ఎంపీపీ గోవర్ధన్, కొండూరు మాధవి దంపతుల కుమార్తె వివాహం జరగనున్న నేపథ్యంలో,బుధవారం ఎస్.పి.ఆర్ కన్వెన్షన్లో నిర్వహించిన హల్దీ వేడుకకు తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి దంపతులు హాజరయ్యారు.ఈ సందర్భంగా వధువుకు సంప్రదాయబద్ధంగా పట్టువస్త్రాలు అందజేసి వివాహ శుభాకాంక్షలు తెలిపారు. నూతన జీవితంలోకి అడుగుపెడుతున్న వధువు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో కలకాలం వర్ధిల్లాలని ఆకాంక్షించారు.
