రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

Annepaka Srikanth
  • త్రిపురారం :- మండల పరిధిలోని కళ్యాణి రైస్ మిల్లు సమీపంలో గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో త్రిపురారం గ్రామానికి చెందిన యువకుడు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. త్రిపురారం గ్రామానికి చెందిన పర్వతం మహేష్ (24), తండ్రి అంజయ్య, గురువారం ఉదయం సుమారు 11:30 గంటల సమయంలో తన ద్విచక్ర వాహనంపై త్రిపురారం నుంచి మిర్యాలగూడకు వెళ్తుండగా కళ్యాణి రైస్ మిల్లు సమీపంలో అకస్మాత్తుగా గేదెలు రోడ్డుపైకి వచ్చాయి. వాటిని తప్పించబోయే క్రమంలో బైక్ అదుపుతప్పి కిందపడటంతో మహేష్‌కు ముక్కు వద్ద తీవ్ర గాయమైంది. వెంటనే చికిత్స నిమిత్తం మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మహేష్ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతుడి అన్న పర్వతం శ్రీకాంత్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు త్రిపురారం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ కైగురి నరేష్ తెలిపారు.

You may also like...