పేద కుటుంబాలకు అండగా ఎమ్మెల్యే కాలే యాదయ్య

జ్ఞాన తెలంగాణ, నవాబుపేట: పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా, ఆపదలో ఉన్న కుటుంబాలకు అండగా నిలుస్తూ చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య చొరవ చూపారు. నవాబుపేట మండల ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్ఎఫ్) ద్వారా మంజూరైన రూ.10,83,000 విలువైన చెక్కులను 23 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే కాలే యాదయ్య స్వయంగా పంపిణీ చేశారు. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న పేద కుటుంబాలకు ప్రభుత్వ సహాయం కొంతమేర ఉపశమనం కలిగిస్తుందని ఆయన పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాల ఫలాలు అందేలా కృషి చేస్తామని భరోసా ఇచ్చారు. ప్రజా సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


You may also like...