మోశంపూర్‌లో రైతుల సమస్యలపై మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ ఆగ్రహం

▪️ 15 రోజులైనా వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభించకపోవడంపై కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు

▪️ వారం రోజుల్లో కొనుగోళ్లు చేపట్టకపోతే కలెక్టరేట్ ముట్టడిస్తామని హెచ్చరిక

రామారెడ్డి మండలం మోశంపూర్‌ గ్రామంలో మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ పర్యటించి వడ్ల కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేశారు. కల్లంలో రైతులు వడ్లు పోసి 15 రోజులు గడుస్తున్నా కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి రైతుల నుంచి వడ్లు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమేనని విమర్శించారు. మరో వారం రోజుల్లో కొనుగోళ్లు ప్రారంభించకపోతే రైతులతో కలిసి పెద్ద ఎత్తున కలెక్టరేట్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు.

అనంతరం అనారోగ్యంతో బాధపడుతున్న బీఆర్ఎస్ కార్యకర్తలు కరికే నర్సయ్య, కళ్లెం రాజయ్యలను వారి ఇళ్లకు వెళ్లి పరామర్శించి ధైర్యం చెప్పారు. అలాగే గ్రామంలో జరిగిన నూతన గృహప్రవేశ కార్యక్రమానికి హాజరై కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ దశరథ్ రెడ్డి, మాజీ రైతుబంధు మండల అధ్యక్షుడు నారాయణరెడ్డి, తాడ్వాయి మాజీ సొసైటీ చైర్మన్ కపిల్ రెడ్డి, గ్రామ బీఆర్ఎస్ అధ్యక్షుడు, ఉపసర్పంచ్ వంగ సంతోష్ రెడ్డి, యూత్ అధ్యక్షుడు కరికే సత్యరాజ్, పోసానిపేట్ సర్పంచ్ సుద్దాల లింగం, మాజీ సర్పంచ్ గంగారాం, ఉపసర్పంచ్ పర్వారెడ్డి తదితర బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

You may also like...