విద్యుత్ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే మాణిక్ రావు

జహీరాబాద్ నియోజకవర్గంలో విద్యుత్ సరఫరా, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, వ్యవసాయ విద్యుత్ సరఫరా తదితర అంశాలపై విద్యుత్ శాఖ అధికారులతో జహీరాబాద్ ఎమ్మెల్యే శ్రీ కొనింటి మాణిక్ రావు గారు సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ…
నియోజకవర్గంలోని ప్రజలకు ఎలాంటి అంతరాయం లేకుండా నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించాలని, రైతులకు వ్యవసాయ అవసరాల నిమిత్తం విద్యుత్ సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు..గ్రామాలు, పట్టణాల్లో విద్యుత్ సమస్యలపై ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని, విద్యుత్ అంతరాయాలు ఏర్పడినప్పుడు ఆలస్యం చేయకుండా తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
అలాగే విద్యుత్ ప్రమాదాల నివారణకు అవసరమైన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, పెండింగ్‌లో ఉన్న విద్యుత్ సంబంధిత సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులకు సూచించారు..ప్రజలకు మెరుగైన విద్యుత్ సేవలు అందించడంలో అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని ఎమ్మెల్యే మాణిక్ రావు.స్పష్టం చేశారు.

You may also like...