కిస్మత్‌పూర్ దర్గా విలేజ్‌లో వీధి దీపాల మరమ్మతులు చొరవ చూపిన బీఆర్‌ఎస్ నాయకులు.

294273.jpg

కిస్మత్‌పూర్ (122 డివిజన్): రాజేంద్రనగర్ నియోజకవర్గ పరిధిలోని కిస్మత్‌పూర్ 122 డివిజన్ దర్గా విలేజ్‌లో పలుచోట్ల గత కొన్ని రోజులుగా స్ట్రీట్ లైట్లు వెలగకపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ విషయాన్ని గమనించిన బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఎం. నవీన్ కుమార్ ముదిరాజ్ ప్రత్యేక చొరవ తీసుకున్నారు.

ఈరోజు ఆయన జీహెచ్‌ఎంసీ (GHMC) అధికారులతో మాట్లాడి, సిబ్బందిని రప్పించి గ్రామంలోని పలు వీధుల్లో చెడిపోయిన వీధి దీపాలకు తక్షణమే మరమ్మతులు చేయించి, కొత్త లైట్లను వేయించారు. దీంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ విలేజ్ ప్రెసిడెంట్ శామ్యూల్, మాజీ వార్డు సభ్యులు, జావిద్ బేగ్, రాములు యాదవ్, మహమ్మద్ మరియు స్థానిక గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

You may also like...