వెల్దండలో అక్రమ మద్యం తయారీ పై పోలీసుల సంయుక్త దాడులు

వెల్దండ సెప్టెంబర్ 30:వెల్దండ మండలంలో అక్రమ మద్యం తయారీపై ఎక్సైజ్‌, పోలీసు శాఖల ఆధ్వర్యంలో సంయుక్తంగా దాడులు నిర్వహించారు.పోచమ్మగడ్డ తండా, సిలోనిబావి తండా ప్రాంతాల్లో నిర్వహించిన తనిఖీల్లో అక్రమంగా తయారు చేస్తున్న 1,450 లీటర్ల ఎఫ్‌జే వాష్‌ను ధ్వంసం చేశారు. అలాగే 10 లీటర్ల ఐడీ లిక్కర్‌, 480 కిలోల నల్లబెల్లాన్ని స్వాధీనం చేసుకున్నారు.అక్రమ మద్యం తయారీకి సంబంధించి ఒకరిని అరెస్టు చేసి ఆరు కేసులు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.డిప్యూటీ కమిషనర్‌, ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌, అసిస్టెంట్‌ కమిషనర్‌ మహబూబ్‌నగర్‌, జిల్లా ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ అధికారి నాగర్‌కర్నూల్‌ ఆదేశాల మేరకు ఈ దాడులు చేపట్టారు.ఈ దాడుల్లో డీటీఎఫ్‌ సీఐ నాగార్జునరెడ్డి, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సీఐ తిరుపతిరెడ్డి,ఎస్‌టీఎఫ్‌ సీఐ వెంకటేశ్వర్లు,కల్వకుర్తి ఎస్‌హెచ్‌వో కె.రవిచంద్రరెడ్డి, ఎస్‌ఐ చాంద్‌బీ షేక్‌తో పాటు ఎక్సైజ్‌, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.అక్రమ మద్యం తయారీ, రవాణా,నిల్వ, విక్రయాలకు పాల్పడే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. అక్రమ మద్యం నిర్మూలనకు తనిఖీలు, దాడులు నిరంతరం కొనసాగుతాయని తెలిపారు.1001224535.jpg

You may also like...