ఉత్తమ ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించిన ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి
- గ్యాస్ వినియోగదారులకు నేటితో ఈ కేవైసీ గడువు - September 30, 2026
- మృతుడి కుటుంబానికి కాంగ్రెస్ నేత ఆర్థిక చేయూత - September 30, 2026
- లక్షలాది గొంతుకలు ఏకమై జై తెలంగాణ అని నినదించిన రోజు - September 30, 2026
కల్వకుర్తి సెప్టెంబర్ 29 : ఉపాధ్యాయుల సేవలను గుర్తించి ప్రోత్సహించడం సమాజ బాధ్యత అని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. ఉపాధ్యాయ వృత్తి అత్యంత గౌరవ 
ప్రదమైనదని, విద్యార్థులకు విద్యతో పాటు క్రమశిక్షణ, నైతిక విలువలు అందిస్తూ సమాజాన్ని సన్మార్గంలో నడిపించడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని పేర్కొన్నారు.రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండల కేంద్రంలోని దేవకీ ఫంక్షన్ హాల్లో మండల పార్టీ అధ్యక్షుడు కాసు శ్రీనివాస్ రెడ్డి సహకారంతో మండల స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుల సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ఉత్తమ ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించి అభినందించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల కృషి ఎంతో గొప్పదని అన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యాబోధనలో నూతన పద్ధతులను అవలంబిస్తూ విద్యార్థులను ఉన్నత లక్ష్యాల వైపు నడిపించాలని సూచించారు. ఉత్తమ సేవలు అందిస్తున్న ఉపాధ్యాయులను గుర్తించి సత్కరించడం ద్వారా మరింత మంది ఉపాధ్యాయులకు ప్రోత్సాహం లభిస్తుందని అన్నారు.ఈ కార్యక్రమంలో ఆమనగల్ మున్సిపల్ చైర్మన్ పత్య నాయక్, మండల విద్యాధికారి సామ్లా నాయక్, నాయకులు యాట నరసింహ, జుట్టు తిరుపతి,మండల పార్టీ కార్యకర్తలు,ఉపాధ్యాయులు, ఉపాధ్యాయురాలు, విద్యార్థులు, స్థానిక ప్రజాప్రతినిధులు, తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
