రిపోర్టర్, కామారెడ్డి | 9989390343
Latest posts by Kethavath Permal
(see all) 
బాన్సువాడ మండలం తిరుమలాపూర్ గ్రామంలో సేవా సంకల్ప అభియాన్ కార్యక్రమంలో భాగంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు నీలం చిన్న రాజులు అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా అంగన్‌వాడీ టీచర్, ఆశా వర్కర్లను సన్మానించి, వారు అందిస్తున్న సేవలకు కృతజ్ఞతలు తెలిపారు.
అంగన్‌వాడీలకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న వివిధ పథకాలను వివరించారు. అనంతరం అంగన్‌వాడీ చిన్నారులకు పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో బీజేపీ రూరల్ మండల అధ్యక్షులు మజ్జిగ శ్రీనివాస్, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి, అంగన్‌వాడీ టీచర్ స్వప్న, ఆశా వర్కర్లు సుమలత, స్వరూప, బీజేపీ నాయకులు దోమకొండ సాయిప్రసాద్, కమ్మరి శివకుమార్, గుర్ల సాయిలు, పిల్లల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.