ఓటర్ల హక్కుల పరిరక్షణకు కాంగ్రెస్ ధర్నా ఓటు హక్కును హరిస్తే ఊరుకునేది లేదు
- ఓటర్ల హక్కుల పరిరక్షణకు కాంగ్రెస్ ధర్నా ఓటు హక్కును హరిస్తే ఊరుకునేది లేదు - September 28, 2026
- SIRపై కాంగ్రెస్ నిరసన ర్యాలీ నెహ్రూ పార్క్ నుంచి కలెక్టరేట్ వరకు భారీ ప్రదర్శన - September 28, 2026
- జనగామలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ - September 28, 2026

ఓటర్ల హక్కుల పరిరక్షణ, ఓటర్ల జాబితా సవరణలో పారదర్శకత పాటించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ ఆధ్వర్యంలో జనగామ జిల్లా కేంద్రంలో సోమవారం భారీ ర్యాలీ, ధర్నా నిర్వహించారు. డీసీసీ అధ్యక్షురాలు ధన్వంతి లక్ష్మీ నారాయణ లకావత్ ఆధ్వర్యంలో నెహ్రూ పార్క్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ సాగింది. ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, మామిడాల యశస్విని రెడ్డి, నియోజకవర్గ ఇన్చార్జి కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించి, అర్హులైన ఓటర్ల పేర్లు తొలగించకుండా చూడాలని, SIR ప్రక్రియ వివరాలను ప్రజలకు వెల్లడించాలని డిమాండ్ చేశారు. కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. అనంతరం CEC జ్ఞానేశ్ కుమార్ దిష్టిబొమ్మను దహనం చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
