కర్ణాటక, గుజరాత్‌లో మోదీ పర్యటన

కర్ణాటక: ప్రధాని నరేంద్ర మోదీ నేటి నుంచి కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాల్లో రెండు రోజులపాటు పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా పలు కీలక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. తొలిరోజు బెంగళూరులో రూ.15,600 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. అనంతరం ప్రశాంతి కుటీరం స్వర్ణోత్సవ వేడుకల్లో పాల్గొని ప్రసంగించనున్నారు. నగర ప్రజా రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేసే లక్ష్యంతో నూతన మెట్రో రైలు సేవలను జెండా ఊపి ప్రారంభించనున్నారు. అనంతరం మెట్రో రైలులో ప్రయాణించనున్నారు. అలాగే మైసూరులోని భారత్ వన్‌లో ఏర్పాటు చేసిన ‘కాస్మోస్–మైసూరు ప్లానిటోరియం’ను ప్రారంభించనున్నారు. ఈ పర్యటనలో మౌలిక వసతులు, రవాణా, విద్యా, విజ్ఞాన రంగాలకు సంబంధించిన పలు కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు.

You may also like...