రాచూర్ బీటి రోడ్డు నిర్మాణానికి ప్రజావాణిలో ఫిర్యాదు

1001218246.jpg

వెల్దండ సెప్టెంబర్ 28: వెల్దండ మండల కేంద్రంలోని ఎంపీడీవో అధ్యక్షతన ఏర్పాటు చేసిన ప్రజావాణి కార్యక్రమంలో పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి ఒక్క ఫిర్యాదు అందినట్లు ఎంపీడీవో సులోచన తెలిపారు.మండల కేంద్రం నుండి రాచూర్ గ్రామానికి బీటీ రోడ్డు నిర్మాణాని కై పలుమార్లు అధికారులకు దరఖాస్తులు అందజేసి పాదయాత్రలు చేపట్టిన రోడ్డు పనులు చేపట్టకపోవడం బాధాకరమంటూ వినతిలో పేర్కొన్నట్టు వార్డు సభ్యులు సురేష్ రెడ్డి, కొంగళ్ళ స్వాతి శివశంకర్ తెలిపారు. ప్రజావాణికి వచ్చిన ఫిర్యాదులను తీసుకోకుండా తిప్పి పంపుతున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు.ఏది ఏమైనా ప్రజావాణికి స్పందన కరువైందని చెప్పొచ్చు,సమస్యలు లేఖనా? ప్రజలకు సరైన అవగాహన కల్పించకపోవడమా అనే సందేహాలు వెల్లువెత్తుతున్నాయి.ఈ సందర్బంగా పంచాయతీరాజ్ శాఖ అధికారులతో మాట్లాడి త్వరగా సమస్య పరిష్కరించే విధంగా చర్యలు చేపడతామని ఎంపీడీవో సులోచన అన్నారు.

You may also like...