రిపోర్టర్, కామారెడ్డి | 9989390343
Latest posts by Kethavath Permal
(see all) 
ఓటు హక్కు పరిరక్షణ, పారదర్శక ఓటర్ల జాబితా రూపకల్పనను డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఏఐసీసీ, టీపీసీసీ ఆదేశాల మేరకు చేపట్టిన ఈ ఆందోళనకు జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు, డీసీసీ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్, యువజన కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు మహమ్మద్ ఇలియాస్ నాయకత్వం వహించారు.
ఎస్ఐఆర్ ప్రక్రియలో అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. ఎన్నికల సంఘం తీరును నిరసిస్తూ సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం సీఈసీ దిష్టిబొమ్మను దహనం చేశారు. కేంద్ర ప్రభుత్వం, బీజేపీపై పలు ఆరోపణలు చేశారు.
అర్హులైన ప్రతి ఒక్కరి ఓటు హక్కును కాపాడాలని కోరుతూ జిల్లా కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో మద్ది చంద్రకాంత్ రెడ్డి, ఇప్ప ఉమారాణి శ్రీనివాస్, కైలాస్ శ్రీనివాస్, ఐరేని సందీప్ కుమార్, పండ్ల రాజు తదితరులు పాల్గొన్నారు.