కొండాపూర్ ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడిగా ఎర్రోళ్ల సీమోన్

కొండాపూర్, సెప్టెంబర్ 27: ఎమ్మార్పీఎస్ కొండాపూర్ మండల కమిటీని ఏకగ్రీవంగా ఏర్పాటు చేశారు. సంగారెడ్డి జిల్లా నియోజకవర్గ ఇన్‌చార్జి రామారావు శ్రీనివాస్, సభాధ్యక్షులు డి. అశోక్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి జిల్లా అధ్యక్షుడు మాజీ మైసగళ్ల బుచ్చందర్ ముఖ్య అతిథిగా హాజరై కమిటీని ప్రకటించారు.

మల్కాపూర్ గ్రామానికి చెందిన ఎర్రోళ్ల సీమోన్‌ను కొండాపూర్ మండల అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ నియమ నిబంధనలను నాయకులు వివరించారు.

మందకృష్ణ మాదిగ పోరాట బాటలో నడుస్తూ దళితుల హక్కుల కోసం ముందుండి పోరాడుతామని సీమోన్ తెలిపారు. మాదిగ జాతి ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి అన్ని విధాలుగా కృషి చేస్తానన్నారు. ప్రధాన కార్యదర్శిగా గారకుర్తి ప్రవీణ్ కుమార్, గౌడిచర్ల రమేష్, ఎస్. రాజు సతీష్‌తో పాటు పలువురు ముఖ్య కార్యకర్తలు, సీనియర్ నాయకులు పాల్గొన్నారు1406560.jpg

You may also like...