మోమిన్ పేట్: మహిళ సంఘాల సభ్యులకు అక్షర మాల పరీక్షలు

మోమిన్ పేట్ మండలకేంద్రం అన్ని  గ్రామాల  ప్రభుత్వ పాఠశాలల్లో అమ్మకు అక్షర మాల కార్యక్రమంలో భాగంగా ఉల్లాస్ శిక్షణ ద్వారా మహిళ సంఘాల సభ్యులకు పరీక్ష నిర్వహించారు. మహిళలకు కనీస అక్షర పరిజ్ఞానం పెంపొందించేందుకు  

ఈ రోజు అన్ని గ్రామాల ప్రభుత్వ పాఠశాలల్లో పరీక్షలు నిర్వహించారు. మహిళలు విద్యావంతులైతే ఇక కుటుంబమే కాదు. మొత్తం సమాజమే అభివృద్ధి చెందుతుంది. సమాజంలో పురుషులతో సమానంగా ఆర్థిక, సామాజిక, రాజకీయ మరియు విద్యా పరమైన అవకాశాలను పొందాలంటే ప్రతి మహిళకు అక్షర పరిజ్ఞానం అవసరం. ఈ కార్యక్రమంలో మండల కమ్యూనిటీ కోఆర్డినేట్, గ్రామ విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్, మహిళ సంఘాల అధ్యక్షురాలు పాల్గొన్నారు.

You may also like...