కాంగ్రెస్ ప్రభుత్వం లోని ఆమనగల్ అభివృద్ధికి అడుగులు మున్సిపాలిటీ చైర్మన్ పత్యా నాయక్

1001216049.jpg

ఆమనగల్లు: కాంగ్రెస్ ప్రభుత్వ హాయంలో ఎంపీ మల్లు రవి,ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ఆధ్వర్యంలో ఆమనగల్లు వేగంగా అభివృద్ధి చెందుతుందని ఆమనగల్ మున్సిపాలిటీ చైర్మన్ పత్య నాయక్ అన్నారు.ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అమనగల్ లో అదనపు సివిల్ కోర్టు మంజూరు చేయడం హర్షణీయమని,దూర ప్రాంతాలకు వెళ్లే స్థానిక ప్రజలకు దూరం తగ్గి ఆమనగల్లు లో వ్యాపారాలు అభివృద్ధి చెందుతున్నాయని తెలిపారు. సుమారు వారం రోజుల క్రితం అభివృద్ధి పనుల కోసం రెండు కోట్ల నిధులు మంజూరు చేయడం జరిగిందని సిసి రోడ్డు పనులు నడుస్తున్నాయి పేర్కొన్నారు. రాబోయే రోజులలో మరిన్ని ప్రభుత్వ కార్యాలయాలు. అభివృద్ధికి నిధులు తీసుకొచ్చి అమనగల్ మునిసిపాలిటీని ప్రజల సహకారంతో అగ్ర భాగాన నిలువుతామని పత్య నాయక్ స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి మానయ్య,పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి,శివలింగం,సీఓఓపి ఖాదర్,ఏ.ఎమ్.సీ డైరెక్టర్ శ్రీశైలం ధోనికుమార్ మహేష్ శివ పాల్గొన్నారు

You may also like...