అమ్మకు అక్షరమాల పరీక్షలు.. మహిళల బలోపేతమే సమాజానికి పునాది
- నీటిపారుదల డీఈఈ ఇంట్లో ఏసీబీ సోదాలు – రూ.100 కోట్ల అక్రమాస్తులు.! - November 12, 2026
- మాట తప్పేది లేదు మడమ తిప్పేది లేదు -మాట నిలబెట్టుకున్న సుంకిరెడ్డి.! - November 12, 2026
- సర్పంచులకు ఓటు హక్కు ఇవ్వండి.! ప్రభుత్వానికి పోలేపల్లి సర్పంచ్ జంతుక వెంకటయ్య వినతి..! - November 12, 2026

వెల్దండ: మండలంలోని అన్ని గ్రామాల్లో ‘అమ్మకు అక్షరమాల’ కార్యక్రమంలో భాగంగా ఉల్లాస్ శిక్షణ ద్వారా మహిళా సంఘాల సభ్యులకు కనీస అక్షర పరిజ్ఞానం పెంపొందించేందుకు ఆదివారం ప్రభుత్వ పాఠశాలల్లో పరీక్షలు నిర్వహించారు. మండల కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమాన్ని సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్ ప్రారంభించారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ మహిళలు విద్యను అభ్యసిస్తే కుటుంబంతో పాటు సమాజంలోనూ వెలుగులు నింపుతారని అన్నారు. కార్యక్రమంలో డీపీఎం శ్రీనివాస్, ఏపీఎంలు జయమాలిని, సంతోష్‌కుమార్, వార్డు సభ్యులు పురుషోత్తం చారి, మసిగుండ్ల వెంకటేష్, నాయకులు పుల్లయ్య, జంగిలి కొండల్‌తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
