డిండి లిఫ్ట్ రద్దు చేయాలని డిమాండ్: UMPPS JAC మహా పాదయాత్రలో మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ :
- కల్వకుర్తి నియోజకవర్గంలో వైద్య విద్యార్థులకు ఉప్పల వెంకటేష్ ఆర్థిక భరోసా - September 28, 2026
- చిరు వ్యాపారుల జీవనోపాధి కాపాడండి: బీజేపీ నేత తల్లోజు ఆచారి డిమాండ్ - September 28, 2026
- డిండి లిఫ్ట్ రద్దు చేయాలని డిమాండ్: UMPPS JAC మహా పాదయాత్రలో మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ : - September 28, 2026
పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం నీటిని నల్లగొండ జిల్లాకు తరలించే డిండి లిఫ్ట్‌ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ UMPPS JAC ఆధ్వర్యంలో చేపట్టిన మహా పాదయాత్రలో కల్వకుర్తి నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్, మాజీ శాసనసభ్యులు శ్రీ గుర్కా జైపాల్ యాదవ్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మార్గమధ్యంలోని ఎల్లికల్ గ్రామానికి చేరుకున్న జైపాల్ యాదవ్ కు గ్రామ రైతులు ఘన స్వాగతం పలికారు. పాదయాత్ర విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ తమ సంపూర్ణ మద్దతును ప్రకటించారు.అనంతరం రైతుల సమస్యలు, పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం నీటి వినియోగం, డిండి లిఫ్ట్‌కు సంబంధించిన అంశాలపై జైపాల్ యాదవ్ రైతులతో చర్చించారు. రైతుల ప్రయోజనాలు, సాగునీటి హక్కుల పరిరక్షణ కోసం జరిగే ప్రజా ఉద్యమాలకు తమ సహకారం ఎప్పుడూ ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో స్థానిక రైతులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు.
