శంకర్ పల్లిలో ఘనంగా చాకలి ఐలమ్మ 131వ జయంతి వేడుకలు

శంకర్ పల్లిలో ఘనంగా చాకలి ఐలమ్మ 131వ జయంతి వేడుకలు

​శంకర్ పల్లి:

శంకర్ పల్లి మండల కేంద్రంలో తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ 131వ జయంతి వేడుకలను శనివారం అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శంకర్ పల్లిలోని చాకలి ఐలమ్మ విగ్రహానికి చేవెళ్ల ఎమ్మెల్యే శ్రీ కాలే యాదయ్య పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

​ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ప్రవీణ్ కుమార్, వివిధ వార్డుల కౌన్సిలర్లు, జిల్లా, మండల, గ్రామ స్థాయి రజక సంఘ ప్రతినిధులు మరియు నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. తెలంగాణ సాయుధ పోరాటంలో ఐలమ్మ చూపిన ధైర్య సాహసాలు, చేసిన త్యాగాలు చిరస్మరణీయమని నాయకులు కొనియాడారు.

You may also like...