డీసీసీ అధికార ప్రతినిధి డా. నరేందర్ పవార్
- రెడ్‌క్రాస్ సొసైటీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ పూర్తి - September 25, 2026
- అనుమతులు లేని వైద్య కేంద్రాలపై అధికారుల కొరడా - September 25, 2026
- 22వ వార్డులో ఘనంగా అన్నదాన కార్యక్రమం – హాజరైన మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి శ్రీ కడకంచి బాలమణి శ్రీనివాస్ గారు - September 25, 2026
ఎన్నికల సంఘం నిర్ణయాలపై ప్రజల్లో తలెత్తుతున్న అనుమానాలకు స్పష్టమైన సమాధానాలు ఇవ్వాలని జనగామ జిల్లా డీసీసీ అధికార ప్రతినిధి, ఓయూ తెలంగాణ ఉద్యమకారుడు డా. నరేందర్ పవార్ డిమాండ్ చేశారు.ఓటర్ల జాబితాల నిర్వహణ, SIR ప్రక్రియ, Form-6లో మార్పులు, ఎన్నికల సంఘం అంతర్గత నిర్ణయాలపై పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఇటీవల వెలువడిన నివేదికల్లో ఎన్నికల కమిషనర్లు సుఖ్‌బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి 10 నెలల వ్యవధిలో 14 సందర్భాల్లో కొన్ని నిర్ణయాలపై అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు వెల్లడైందని తెలిపారు.Form-6లో మార్పులు ఎందుకు తీసుకొచ్చారు, ఓటర్ల పేర్ల చేర్పులు–తొలగింపులకు సంబంధించిన పూర్తి వివరాలు, కారణాలు, ఆధారాలను ప్రజల ముందుంచాలని కోరారు. ఎన్నికల సంఘం నిర్ణయాలపై పూర్తి పారదర్శకత పాటించాలని డిమాండ్ చేశారు.CEC నియామక వ్యవస్థలో మార్పులపై కూడా కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని పవార్ కోరారు. ఎన్నికల సంఘంపై రాజకీయ పక్షపాతానికి సంబంధించిన అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ప్రజల్లో విశ్వాసం కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉందన్నారు.ప్రజాస్వామ్యంపై విశ్వాసాన్ని కాపాడేందుకు CEC గ్యానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు
