డ్రైనేజీ సమస్యకు పరిష్కారం.. కాలనీవాసుల హర్షం
- చేవెళ్ల ఎమ్మెల్యే కు దసరా శుభాకాంక్షలు తెలిపిన శంకర్పల్లి కాంగ్రెస్ నాయకులు - October 22, 2026
- ఘనంగా శంకర్పల్లి మున్సిపల్ చైర్పర్సన్ జన్మదిన వేడుకలు - October 22, 2026
- వెంకటపూర్ నుండి అమ్మవారి దర్శనానికి పాదయాత్ర - October 22, 2026

దేవరుప్పుల: మండల కేంద్రంలోని కొత్తవాడలో ఎస్సీ కాలనీకి వెళ్లే మార్గంలో డ్రైనేజీ సమస్యతో ఇబ్బందులు పడుతున్న కాలనీవాసులకు ఉపశమనం లభించింది. ఏడో వార్డు సభ్యుడు చిలుకూరి నరసయ్య ప్రత్యేక చొరవ తీసుకుని గ్రామ సర్పంచ్ పెద్ది కృష్ణమూర్తి గౌడ్ దృష్టికి సమస్యను తీసుకెళ్లారు. స్పందించిన సర్పంచ్ వెంటనే అధికారులకు సమస్యను తెలియజేసి పరిష్కారానికి చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా కోలుకొండ వెంకన్న ఇంటి సమీపంలో నిలిచిపోయిన డ్రైనేజీ సమస్యను, భీమయ్య ఇంటి వద్ద దెబ్బతిన్న డ్రైనేజీ ర్యాంపును పూర్తి చేశారు. దీంతో సంతోషం వ్యక్తం చేసిన గ్రామ ప్రజలు, కొత్త కాలనీవాసులు వార్డు సభ్యుడు చిలుకూరి నరసయ్యకు, సర్పంచ్ పెద్ది కృష్ణమూర్తి గౌడ్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
