బాలాపూర్ గణనాథుడి సన్నిధిలో బీఆర్ఎస్ నేతల ప్రత్యేక పూజలు
- ఆమనగల్లులో వినాయక మండపంలో మాజీ ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు - September 22, 2026
- త్రిదలన్ యూత్ గణనాథుడిని దర్శించుకున్న ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ సునేంద్ర కుమార్ - September 22, 2026
- చారగొండ మండల సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే వంశీకృష్ణ - September 22, 2026

దేశ ప్రసిద్ధి గాంచిన బాలాపూర్ గణేష్ ఉత్సవాల్లో కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, బీఆర్ఎస్ రాష్ట్ర మీడియా ప్యానలిస్టు, సర్పంచుల సంఘం మాజీ రాష్ట్ర అధ్యక్షుడు గూడూరు లక్ష్మీ నర్సింహ్మ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.గణనాథుడికి అర్చనలు చేసి ప్రజలందరూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించారు. ఉత్సవాలు ప్రశాంతంగా కొనసాగాలని ఆకాంక్షించారు.అనంతరం ఉత్సవ కమిటీ అధ్యక్షుడు నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వాహకులు వారిని శాలువాతో సత్కరించి, బాలాపూర్ ప్రసిద్ధ లడ్డూ ప్రసాదాన్ని అందజేశారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు వంగేటి లక్ష్మా రెడ్డి, చిగురింత శ్రీరాం రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
