కల్వకుర్తి కోర్టుకు రేపు మాజీ ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డి

కల్వకుర్తి రెవెన్యూ డివిజన్ సాధన ఉద్యమ సమయంలో నాటి BRS ప్రభుత్వం అక్రమంగా నమోదు చేసిన కేసులో భాగంగా మాజీ ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డి గారు రేపు కల్వకుర్తి కోర్టుకు హాజరు కానున్నారు.రేపు ఉదయం 11 గంటలకు కల్వకుర్తి కోర్టులో ఆయన హాజరు కానున్నట్లు వెల్డండ యువజన కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షులు కడారి శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.కల్వకుర్తిని రెవెన్యూ డివిజన్ చేయాలని జరిగిన ఉద్యమంలో పాల్గొన్న నాయకులపై అప్పటి ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించిందని, ఆ కేసు విచారణ నిమిత్తం వంశీచంద్ రెడ్డి గారు కోర్టుకు వస్తున్నారని ఆయన పేర్కొన్నారు.కాంగ్రెస్ శ్రేణులు, అభిమానులు, ఉద్యమంలో పాల్గొన్న నాయకులు రేపు కోర్టు వద్దకు తరలిరావాలని కోరారు.1001334739.jpg

You may also like...