వెల్దండకు సరికొత్త బజాజ్ పల్సర్ బైక్ – రిబ్బన్ కట్ చేసిన సర్పంచ్

వెల్దండకు సరికొత్త బజాజ్ పల్సర్ బైక్.. రిబ్బన్ కట్ చేసిన సర్పంచ్1001193600.jpg

వెల్దండ, సెప్టెంబర్ 19: పల్లె పల్లెకు పల్సర్ బండి కార్యక్రమంలో భాగంగా వెల్దండ మండల కేంద్రంలో సరికొత్తగా మార్కెట్లోకి వచ్చిన బజాజ్ పల్సర్ బైక్‌ను శనివారం ఆవిష్కరించారు. బజాజ్ షోరూం నిర్వాహకులు జగన్ గౌడ్, పర్యవేక్షకులు రాఘవేందర్ గౌడ్ ఆహ్వానం మేరకు గ్రామ సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్ ముఖ్యఅతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేసి బైక్‌ను ప్రారంభించారు. సర్పంచ్ మాట్లాడుతూ.. ప్రజల్లో అత్యంత నమ్మకం కలిగిన బజాజ్ కంపెనీ నుండి పల్సర్ 150, 125 సిసి రేంజ్ బైకులు అందుబాటులోకి వచ్చాయని, బజాజ్ కంపెనీ ఎలాంటి లాభాలు లేకుండా నూతన టెక్నాలజీని ఉపయోగించి మార్కెట్లోకి సరికొత్త మోడల్ తీసుకురావడం హర్షించదగ్గ విషయం అన్నారు.ఈ సందర్భంగా నూతన మోడల్ బైక్ ప్రత్యేకతలను నిర్వాహకులు వివరించారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ బస్నమోని శ్రీను ముదిరాజ్, నాయకులు కానుగుల జంగయ్య, నిరంజన్, ప్రభాకర్, పోలె అశోక్, డీలర్ వెంకటయ్య, తిరుపతి రెడ్డి, మట్ట విష్ణు గౌడ్, భీమరాజు, అశోక్ కుమార్‌తో పాటు పలువురు గ్రామ నాయకులు, యువకులు పాల్గొన్నారు.

You may also like...