ఎఫ్ పి ఓ తో రైతుల అభివృద్ధికి బాటలు – సింగిల్ విండో చైర్మన్ భాస్కరరావు
- వెల్దండకు వెలుగులు – 100 కెవి ట్రాన్స్ఫార్మర్ ప్రారంభించిన సర్పంచ్ - September 19, 2026
- కల్వకుర్తిలో విషాద ఘటన వినాయక మండపం వద్ద విద్యుత్ షాక్ తో యువకుడు బలి - September 19, 2026
- బాలల బంగారు భవిష్యత్తుకు పోషకాహారమే పునాది – వెల్దండలో సమన్వయ సమావేశం - September 19, 2026

వెల్దండ, సెప్టెంబర్ 18: ఉమ్మడి వెల్దండ మండలంలోని సింగిల్ విండో రైతులందరూ రైతు ఉత్పత్తిదారుల సంస్థ (ఎఫ్‌పీవో)ను సద్వినియోగం చేసుకోవాలని సింగిల్ విండో చైర్మన్ భాస్కర్ రావు కోరారు. శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎఫ్‌పీవోలో 750 మంది రైతులు రూ.2 వేల చొప్పున సభ్యత్వం పొందితే రూ.15 లక్షలు జమ అవుతాయని, కేంద్ర ప్రభుత్వం మరో రూ.15 లక్షలు అందిస్తుందని తెలిపారు. దీంతో సహకార సంఘాలు బలోపేతం కావడంతో పాటు రైతులకు నాణ్యమైన పప్పు దినుసులు, విత్తనాలు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు.చెర్కూర్ గ్రామంలోని సింగిల్ విండోకు చెందిన సర్వే నంబర్ 539లోని 10 గుంటల భూమిని గుర్తించి వినియోగంలోకి తీసుకురావడంతో పాటు ప్రహరీ నిర్మాణంపై డైరెక్టర్లతో సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. పెద్దాపూర్ గ్రామంలో సంస్థకు కేటాయించిన 1.39 ఎకరాల భూమికి సంబంధించి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి సిఫార్సు లేఖను జిల్లా కలెక్టర్‌కు పంపించారని,త్వరలో ప్రొసీడింగ్స్ అందనున్నాయని వెల్లడించారు. రైతులందరూ సకాలంలో సభ్యత్వం నమోదు చేసుకుని సంస్థను బలోపేతం చేయాలని భాస్కర్ రావు పిలుపునిచ్చారు.
