సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే..కసిరెడ్డి
- బాన్సువాడ బాయ్స్ పాఠశాలలో విద్యార్థినులకు యూనిఫాం పంపిణీ - September 3, 2026
- మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు భేటీ - September 3, 2026
- సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే..కసిరెడ్డి - September 3, 2026

కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి గురువారం హైదరాబాద్‌లోని తన నివాసంలో వివిధ మండలాలకు చెందిన లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు మరియు ఎల్ఓసీ పత్రాలను ఆయా మండలాల ముఖ్య నాయకుల సమక్షంలో అందజేశారు.అనంతరం యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నాగర్‌కర్నూల్‌కు చెందిన శేఖర్‌రెడ్డిని పరామర్శించి, ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించడంతో పాటు అవసరమైన అన్ని వైద్య సహాయాలు అందించాలని వైద్యులను సూచించారు. తదుపరి, ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా తలకొండపల్లి మండల విద్యాధికారి ఎంఈఓ చంప్లా నాయక్ అందించిన ఆహ్వాన పత్రికను ఎమ్మెల్యే స్వీకరించారు.అనంతరం ఉస్మానియా విశ్వవిద్యాలయానికి చెందిన విద్యార్థులు ఎమ్మెల్యేను కలిసి డీఎస్సీ నోటిఫికేషన్‌కు సంబంధించిన అంశాలను ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి, విద్యార్థులకు అనుకూలంగా నిర్ణయం తీసుకునేలా సహకరించాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు.విద్యార్థుల సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి, సాధ్యమైనంత మేరకు పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో వివిధ మండలాల ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

