రైల్వే డబుల్ లైన్ భూసేకరణ పనులు వేగవంతం చేయాలి

రైల్వే డబుల్ లైన్ భూసేకరణ పనులు వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అన్నారు.సోమవారం, రాష్ట్రంలోని రైల్వే రోడ్డు ప్రాజెక్టుల భూసేకరణ, రైల్వే విస్తరణ, డబుల్ లైన్, ప్రగతి ప్రాజెక్టుపై హైదరాబాదు నుంచి *రాష్ట్ర రోడ్డు, రవాణా శాఖ ప్రత్యేక కార్యదర్శి వికాస్ రాజ్ తో కలిసి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఈ వీడియో సమావేశానికి హాజరయ్యారు.
ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ రాష్ట్రంలో రైల్వే విస్తరణకు అవసరమైన భూసేకరణ పనులు త్వరితగతిన పూర్తి చేసి భూములను అప్పగించాలని కలెక్టర్లను ఆదేశించారు.భూసేకరణలో ఎలాంటి జాప్యానికి తావు ఇవ్వకుండా ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.అలాగే ప్రతి రైల్వే ప్రాజెక్టుకు సంబంధించిన భూసేకరణ పురోగతిని జిల్లా కలెక్టర్లు నిరంతరం పర్యవేక్షించాలని, పెండింగ్ అంశాలను వెంటనే పరిష్కరించి నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని సూచించారు.ఈ వీడియో కాన్ఫరెన్స్ లో సూపరింటెండెంట్ సిద్ధార్థ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

You may also like...